Current Affairs Telugu Daily

ఇంటర్నెట్ మానవుల ప్రాథమిక హక్కు 

ఇంటర్నెట్‌ సేవలను ఉచితంగా పొందడమన్నది మానవుల ప్రాథమిక హక్కు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
*ఈ అధ్యయనం ప్రకారం,అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఇంటర్నెట్‌ను పొందలేకపోతున్నారని, దీంతో ప్రపంచ స్థాయి వ్యక్తులతో సమానంగా తమ జీవితాలను బాగుపరుచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి.
* ఈ అధ్యయనాన్ని చేపట్టిన బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పరిశోధకులు భారత్‌లోని కేరళ రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా చూపారు.
*ఇంటర్నెట్‌ పొందడమనేది ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించింది.  ఈ ఏడాది చివర కల్లా 3.5 కోట్ల మందికి ఇంటర్నెట్‌ను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
*ఈ అధ్యయనం ప్రకారం,కొందరికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండిమరికొందరికి లేకపోవడం వల్ల ప్రాథమిక స్వేచ్ఛగా పేర్కొనే వ్యక్తీకరణ, సమాచార స్వేచ్ఛలను కోల్పోతారు.


views: 605



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams