Current Affairs Telugu Daily

వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే 

*మనిషి దయతో బతకాలనే స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఏటా నవంబర్‌ 13న వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే నిర్వహిస్తున్నారు.
*భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో దయా గుణం అనేది అంతర్భాగం. దానిని నేటి తరంలో నింపడానికి మన దేశం  ఏటా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తోంది.
* భావితరాల్లో దీనిపై సామాజిక స్పృహ పెంచే లక్ష్యంతో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ గత సెప్టెంబర్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌నే ప్రారంభించింది.
*దయా గుణం అనేది అంతర్లీనంగా అందరిలో ఉన్నా.. దానిని ఎలా చూపాలో తెలియని వారికి ఈ సంస్థ దిశానిర్దేశం చేస్తుంది. 
*తెరవాడ బుద్ధిజం.. గౌతమబుద్ధుని బోధనల్ని, నమ్మకాల్ని ఆచరిస్తూ ప్రచారం చేసే ఒక వర్గమిది. మయన్మార్‌లో పెద్దసంఖ్యలో ఉండే వీరు సంఘ దానాలకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్‌ టాప్‌లో ఉంది. ఈ జన్మలో చేసే మంచి పనులే వచ్చే జన్మలో మెరుగైన జీవితాన్నిస్తాయని తెరవాడ బౌద్ధుల నమ్మకం.
*మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారని చారిటీస్‌ ఎయిడ్‌ ఫౌండేషన్స్‌ వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌ వెల్లడిస్తోంది. థాయ్‌లాండ్‌లోనూ తెరవాడ బౌద్ధులు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది ప్రజలు వివిధ రూపాల్లో సాటి మనుషులకు సాయపడుతుంటారని తేలింది.
*‘దయ’లో టాప్‌–10 దేశాలు   దయాగుణం గల వారి సంఖ్య శాతాల్లో

1. మయనన్మార్‌                                 81

2. యూకే                                          71

3. మాల్టా                                           71   

4. థాయ్‌లాండ్‌                                    71

5. నెదర్లాండ్స్‌                                      71

6. ఇండోనేషియా                                   69

7. ఐర్లాండ్‌                                           69

8. ఆస్ట్రేలియా                                        68  

9. న్యూజీలాండ్‌                                     65

10. కెనెడా                                           63


views: 609



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams