Current Affairs Telugu Daily

అన్ని కార్లలో ‘బ్రెతలైజర్స్‌’

*మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించేందుకు  ఐరోపా కూటమి సరికొత్త సాంకేతిక ఉపయోగించనుంది. 
*2022 సంవత్సరం నుంచి తయారయ్యే అన్ని కార్లలో ‘బ్రెతలైజర్స్‌’ను విధిగా అమర్చాలని ఆదేశించే చట్టాన్ని తీసుకొచ్చింది.
* ఈ చట్టాన్ని గతంలోనే రూపొందించారు.ఐరోపా మండ లినవంబర్ మొదటి వారంలో ఆమోదముద్ర వేసింది.  
*2024 నుంచి అన్ని కార్లలో, అంటే పాత కార్లలో కూడా ‘బ్రెతలైజర్స్‌’ను తప్పని సరి చేసింది.
*డ్రైవర్‌ ఇంజన్‌ను స్టార్ట్‌ చేసే ముందు తప్పనిసరిగా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజన్‌ స్టార్ట్‌ అవుతుంది. సరిగ్గా ఊదక పోయినా ఇంజన్‌ స్ట్రార్ట్‌ కాదు. 
*కారు స్టార్ట్‌ అయ్యాక మార్గమధ్యంలో మద్యం సేవించకుండా నివారించేందుకు మధ్య మధ్యలో కూడా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. 
* ఈ నిబంధనను మద్యం తాగి కారును నడిపిన కేసులో శిక్ష పడిన డ్రైవర్లకు మాత్రమే అమలు చేయనున్నారు. 
*  అన్ని కార్లలో బ్రెతలెజర్స్‌ను అమర్చినప్పుడు, కారు నడిపే డ్రైవర్‌కు అంతకుముందు శిక్ష పడిందా, లేదా అన్న విషయాన్ని బ్రెతలైజర్స్‌ అనుసంధాన వ్యవస్థ గురించి తెలుసుకోవడం, మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్‌ అప్పుడు ఏ కారు నడిపారో ఆ కారుకు మాత్రమే వర్తింప చేస్తారా? అద్దె డ్రైవర్లను పెట్టుకున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఇంతకుముందు శిక్ష పడిన డ్రైవర్, తనకు బదులుగా ఇతరులతోని బ్రెతలెజర్‌ను ఊదిస్తే తప్పించుకునే అవకాశం ఉంది.


views: 693



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams