Current Affairs Telugu Daily

నరేంద్ర మోడీ బ్రెజిల్ పర్యటన 

* ప్రధాని నరేంద్ర మోడీ నేడు బ్రెజిల్‌ పర్యటనకు వెళ్లనున్నారు.నవంబర్ 13, 14 తేదీలలో అక్కడ జరిగే 11వ బ్రిక్స్‌ సమావేశంలో మోడీ పాల్గొంటారు. 
*బ్రిక్స్‌ సమావేశంలో మోడీ పాల్గొనడం వరుసగా ఇది ఆరవసారి.
* బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సమావేశంలో పాల్గొనడానికి భారత్‌నుంచి పెద్దయెత్తున వాణిజ్యవేత్తల బృందం కూడా వెళ్లనున్నది.
*బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలను కలిపి బ్రిక్స్‌ గ్రూపుగా పేర్కొంటారు. 
*దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ త్రిమూర్తి  ప్రకారం,ఈ సదస్సులో సభ్య దేశాల మధ్య సహకార సంబంధాలను బలోపేతం చేసుకునే అంశంపై ఆయా దేశాల నేతలు చర్చించనున్నారు.
*ప్రపంచంలోని జనాభాలో సగంపైగా అంటే దాదాపు 3.6 బిలియన్ల మందికి బ్రిక్స్‌ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
*బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి ఓ కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ కూటమినే బ్రిక్స్ దేశాల కూటమిగా పేర్కొంటారు. ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేదలు పాల్గొంటూ వుంటారు.
ఐదు దేశాలలోని బ్యాంకుల ఆర్ధికాభివృద్ధికి ఆయా దేశ ప్రధాన మంత్రుల బృందం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంక్‌ను నెలకొల్పాయి. 


views: 660



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams