Current Affairs Telugu Daily

 'ఆపరేషన్‌ మా'

*ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్‌ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న మంచి కార్యక్రమం 'ఆపరేషన్‌ మా'. 
*  'ఆపరేషన్‌ మా' పేరుతో ఇండియన్‌ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం వీడి సాధారణ జీవితం గడుపుతున్నారు. 
*'ఈ పథకం ముఖ్య లక్ష్యం --- పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన కశ్మీరు యువతను వెనక్కి తీసుకువచ్చి సమాజంతో మమేకం అయ్యేలా చేయడమే.ఇది కేవలం స్థానిక యువత కోసమే రూపొందించిన కార్యక్రమం.
*ఉగ్రవాద మార్గం నుంచి మళ్లించడమే కాకుండా వారికి పునరావాసం కల్పించే బాధ్యతను కూడా భారత సైన్యం తీసుకుంటుంది.
*దారి తప్పిన యువత మనసు మార్చడం వారి మాతృమూర్తుల వల్లే సాధ్యం.
* అందుకే ఈ కార్యక్రమానికి 'ఆపరేషన్‌ మా' అని పేరు పెట్టారు. 
*ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ -- కె.జె.ఎస్‌. థిల్లాన్‌.
*గతంలోకూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన యువతను సరైన మార్గంలో పెట్టడానికి సైన్యం అనేక చర్యలు చేపట్టింది. అయితే ఈ ఏడాది ప్రారంభించిన 'ఆపరేషన్‌ మా' ద్వారా ఉగ్రవాద గ్రూపులను వదిలి వచ్చిన వారిపై ఏ విధమైన ప్రభుత్వ చర్యలు ఉండవు. 
*అటువంటి వారి వివరాలను బయటకు కూడా చెప్పరు. వారి దగ్గరి బంధువులకు కూడా తెలియనంత గోప్యంగా ఉంచుతారు. 
*వారి పునరావాసానికి సంబంధించిన వివరాలు కూడా ఎవరికీ తెలియనీయకుండా ఉంచుతారు. 
* ఉగ్రవాద ముఠాల్లో చేరకపోయినా,వారి పట్ల సానుభూతి కలిగి, రాళ్లు విసరడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువతకూ ఈ పథకం వర్తిస్తుంది. 
* ఈ పథకం కింద యువతను ఆహ్వానిస్తూ సైన్యం నిరంతరం రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది.


views: 776



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams