Current Affairs Telugu Daily

బొలీవియా అధ్యక్షుడి రాజీనామా

*అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఆ ఎన్నికల్ని రద్దు చేయాలన్న సైన్యం డిమాండ్ నేపథ్యంలో బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ పదవికి రాజీనామా చేశారు.
*దేశంలో తిరిగి తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు  తాను సిద్ధంగా ఉన్నానని ఎవో మొరేల్స్ ప్రకటించారు.
* గతనెల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని రద్దు చేయాలని ప్రతిపక్షాలు, సైన్యం అధికార పక్షాన్ని డిమాండ్ చేశాయి.
*ప్రజాయుత నిరసనలు కూడా ఈ డిమాండ్‌ను సమర్థించడంతో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. 
*దేశ సైన్యాధ్యక్షుడు విలియవ్‌‌సు కాలిమన్ సైతం అధ్యక్షుడి రాజీనామాకు ఒత్తిడి చేశారు. 
*అక్టోబర్ 20న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొరేల్స్ ఘనవిజయం సాధించారు. 
* 13 ఏండ్ల 9 నెలల కాలం పాటు మొరేల్స్ బొలీవియాకు అధ్యక్షుడిగా ఉన్నారు.


views: 616



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams