Event-Date: | 12-Nov-2019 |
Level: | National |
Topic: | Economic issues |
క్షీణించిన పారిశ్రామికోత్పత్తి
*వరుసగా రెండు నెలలు పరిశ్రమల ఉత్పత్తి భారీ క్షీణతను నమోదు చేసుకుంది.
*ఈ ఏడాది ఆగస్టులో -1.1 శాతానికి క్షీణించిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబరులో -4.3 శాతానికి పతనమైంది.
* దాదాపు 8 ఏళ్లలో ఇదే కనిష్ఠ స్థాయి.
*మాన్యుఫాక్చరింగ్ రంగ పనితీరు అత్యంత తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం.
* 2018 సెప్టెంబరులో ఐఐపీ 4.6 శాతంగా నమోదైంది.
* కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐఐపీ డేటా ప్రకారం,సెప్టెంబరులో మాన్యుఫాక్చరింగ్ రంగ ఉత్పత్తి వృద్ధి వార్షిక ప్రాతిపదికన -3.9 శాతానికి పడిపోయింది. ఆగస్టులో -1.2 శాతంగా ఉంది. గత ఏడాది సెప్టెంబరులో మాత్రం 4.8 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది.
*మైనింగ్ రంగం ఉత్పత్తి వృద్ధి -8.5 శాతానికి క్షీణించింది. ఈ ఆగస్టులో, గత ఏడాది సెప్టెంబరులో 0.1 శాతం వృద్ధి నమోదైంది.
*విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల సైతం సెప్టెంబరులో -2.6 శాతానికి జారుకుంది. ఆగస్టులో -0.9 శాతం పతనాన్ని చవిచూసింది. 2018 సెప్టెంబరులో మాత్రం 8.2 శాతం వృద్ధి చెందింది.
*ఈ సెప్టెంబరు, ఆగస్టులో మౌలిక రంగ వృద్ధి వరుసగా -6.4 శాతం, -4.5 శాతంగా ఉంది. కన్జ్యూమర్స్ డ్యూరబుల్స్ రంగంలో -9.9 శాతం, -9.1 శాతంగా నమోదైంది. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్స్ రంగంలో -0.4 శాతం, 4.1 శాతంగా ఉంది.
*మాన్యుఫాక్చరింగ్ రంగానికి చెందిన 23 పరిశ్రమల గ్రూపుల్లో 17 ప్రతికూల వృద్ధినే కనబర్చాయి.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి ఐఐపీ 1.3 శాతంగా నమోదైంది.
*సెప్టెంబరులో 8 కీలక రంగాల (సిమెంట్, స్టీల్, విద్యుత్, ఎరువులు, సహజ వాయువు, ఇంధన శుద్ధి, బొగ్గు, ముడి చమురు) వృద్ధి సైతం -5.2 శాతానికి క్షీణించింది. ఆగస్టులోనూ -0.5 శాతం పతనాన్ని నమోదు చేసుకుంది.
*2019-20 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోయింది.