Current Affairs Telugu Daily

వైజాగ్ విజయవాడ సికింద్రాబాద్ హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌

*విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌ వరకు నిర్మించిన హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పైప్‌లైన్‌ ప్రాజెక్టును కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జాతికి అంకితం చేశారు.
*ఈ మూడు ప్రధాన నగరాల మధ్య పెట్రో ఉత్పత్తుల సరఫరా కోసం ఈ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.
*ఇప్పటికే విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉన్న ఈ పైప్‌లైన్‌ను కొత్తగా సికింద్రాబాద్‌ వరకు విస్తరించారు. 
*విశాఖలోని మాస్టర్‌ కంట్రోల్‌ స్టేషన్‌ నుంచి ఈ మూడు నగరాల మధ్య ఉన్న పైప్‌లైన్‌ను పర్యవేక్షించే రిమోట్‌ కేంద్రాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. 
*సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటైన ఈ పైప్‌లైన్‌పై 24 గంటలపాటు నిఘా ఉంటుంది.
*GAIL ఈ పైప్ లైన్ కొరకు రూ.500 కోట్లు ఖర్చు చేసింది.ఈ  పైప్ లైన్ ద్వారా సంవత్సరానికి 1.164 మిలియన్ టన్నుల LPG ని రవాణా చేస్తారు.అంటే దాదాపు  2.5 లక్షల సిలిండర్లు విజయవాడ మరియు సికింద్రాబాద్ మార్కెట్ కంపెనీలకు అందిస్తుంది. 
*ఈ పైప్ లైన్ పని చేయడం ప్రారంభిస్తే LPG రవాణా ఖర్చు 80 శాతం తగ్గుతుంది.  
*HPCL కు రాష్ట్రంలో 28 లక్షల LPG కష్టమర్లు ఉన్నారు.  



views: 624



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams