Current Affairs Telugu Daily

 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ రజత పతకం

*ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత స్టార్‌ షూటర్‌ సౌరభ్‌ చౌదరి ఆసియా చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ రజత పతకం సాధించాడు.
* చాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన సౌరభ్‌, ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. 
*పసిడి పతకాన్ని ఉత్తర కొరియాకు చెందిన కిమ్‌ సాంగ్‌ గుక్‌ గెలుచుకున్నాడు.
*ఫైనల్‌ పోరులో కిమ్‌ సాంగ్‌ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్‌ 221.8 పాయింట్లతో కాంస్య సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సౌరభ్‌తో పాటు అభిషేక్‌ వర్మ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినా ఐదో స్థానంలో నిలిచాడు. 


views: 611



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams