Current Affairs Telugu Daily

చెన్నై,జాఫ్నా నగరాల మధ్య విమానసేవలు 

*దాదాపు 41 సంవత్సరాల తరువాత చెన్నై, శ్రీలంకలోని జాఫ్నా నగరాల మధ్య విమానసేవలు పునరుద్ధరించబడ్డాయి.
*ఎయిర్‌ ఇండియా అనుబంధ అలియన్స్‌ ఎయిర్‌ వారంలో మూడు రోజులపాటు చెన్నై విమానాశ్రయం నుంచి జాఫ్నాకు విమాన సర్వీసులు నడుపనుంది. 
*రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాలు.
*శ్రీలంకలో ఈలం యుద్ధం ప్రారంభం కావడానికి ముందు వరకు అంటే 1970ల వరకు భారత్‌ నుంచి జాఫ్నాకు విమాన సర్వీసులు నడిచేవి. యుద్ధం ప్రారంభమైన తరువాత అత్యవసర పరిస్థితుల్లో మిలటరీ ఆపరేషన్లకు మాత్రమే విమానాలు నడుపుతున్నారు. 
*యుద్ధం ముగిసి పరిస్థితుల్లో మార్పు వచ్చిన తరువాత 2002లో జాఫ్నా విమానాశ్రయం నుంచి డొమెస్టిక్‌ సర్వీసులను నడుపడం మొదలుపెట్టారు.
*చెన్నై - జాఫ్నాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. గత అక్టోబర్‌ 17న ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించడంతో ప్రయాణికుల విమానాలు నడిపేందుకు మార్గం సుగమమైంది.
*ఎయిర్‌ ఇండియా సంస్థ అధికారికంగా నవంబర్ 11వ తేదీన చెన్నై నుంచి జాఫ్నాకు తొలి విమాన సర్వీసును నడిపింది.
*తొలి సర్వీసులో ఆ దేశ నార్తర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ డా. సురేన్‌ రాఘవన్‌ ప్రయాణించారు. ఆయనకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 


views: 618



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams