Current Affairs Telugu Daily

డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సదస్స

* వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
*వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్‌ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్‌ స్టార్స్‌ పాల్గోనున్నారు.
*ప్రపంచ దేశాలు సమష్టిగా, నిలకడగా వృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసారి దావోస్‌ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
*డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సదస్సు కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.గతేడాది జరిగిన సదస్సులో వీరిద్దరూ పాల్గొనలేదు.
*భారత్‌ నుంచి పేర్లు నమోదైన వారిలో పారిశ్రామిక దిగ్గజాలు ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదాని, కుమార మంగళం బిర్లా, సజ్జన్‌ జిందాల్, నందన్‌ నీలేకని, అజయ్‌ పిరమల్‌ తదితరులు ఉన్నారు. మానసిక స్వస్థతపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలిగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే కూడా ఇందులో పాల్గోనున్నారు. 
* డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపక చైర్మన్‌ క్లాస్‌ ష్వాబ్‌ —-ఆర్థికంగా ఉన్నతవర్గాలు తమకు ద్రోహం చేస్తున్నారనే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది,గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యాలు నెరవేరడంలేదు అన్నారు. 
*సమైక్యం-సుస్తిర నినాదం-2020తో ఈ సమావేశాలు జరగనున్నాయి. 
*ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని  జెనీవాలో కలదు.ఒక ఎన్జీవో గా 1971 లో స్థాపించారు.  


views: 712Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams