Current Affairs Telugu Daily

స్వర్ణ తమిళ సుపుత్రుడు పన్నీర్‌సెల్వం

* అన్నాడీఎంకే సమన్వయకర్త, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంను ప్రపంచ తమిళ పరిశోధనాసంస్థ ‘తంగ తమిళ్‌ మగన్‌’ (స్వర్ణ తమిళ సుపుత్రుడు) పురస్కారంతో సత్కరించింది. 
*ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు చికాగో నగరంలోని ఓక్‌బ్రూక్‌టెరా నగరంలో పదవ ప్రపంచ తమిళ పరిశోధనామహానాడు ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పరిశోధనా సంస్థ నిర్వాహకులు పన్నీర్‌సెల్వంకు తంగ తమిళ్‌ మగన్‌ అవార్డును ప్రకటించారు.
*నవంబర్ 10వ తేదీన ఆ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పన్నీర్‌సెల్వంకు ఈ పురస్కారాన్ని నిర్వాహకులు ప్రదానం చేసి సత్కరించారు. 
*సంస్థ నిర్వాహకులు రాజాకృష్ణమూర్తి, సాంప్రక్‌ మేయర్‌ టాప్‌ డెయిసీ, ఓక్‌బ్రూక్‌టెరా మేయర్‌ గోపాల్‌ ఆల్‌మలానీ, తేని పార్లమెంట్‌ సభ్యుడు, ఓపీఎస్‌ తనయుడు రవీంద్రనాథ్‌ కుమార్‌, ప్రపంచం తమిళ యువజన పేరవై అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌ ప్రభాకర్‌ ఉన్నారు.


views: 638



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams