Current Affairs Telugu Daily

ఏపీ భవన్‌ మాజీ ఆర్‌సీ పీఎస్‌ కృష్ణన్‌ మృతి

*ఐఏఎస్‌ అధికారి ,ఢిల్లీలోని ఏపీ భవన్‌ మాజీ రెసిడెంట్‌ కమిషనర్‌(ఆర్‌సీ) పీఎస్‌ కృష్ణన్‌ నవంబర్ 10వ తేదీన మృతి చెందారు.
*ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో కృష్ణన్‌ పనిచేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలందించారు.
*కృష్ణన్‌ తన రచనల ద్వారా సామాజిక న్యాయం కోసం ప్రజలను చైతన్యవంతులను చేశారు.
*వీపీసింగ్‌ ప్రధానిగా ఉండగా మండల్‌ కమిషన్‌ సిఫార్సుల విషయంలో ప్రముఖ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ కృష్ణన్‌ కృషి చాలా గొప్పది. 
*పీఎస్‌ కృష్ణన్‌ జీవిత చరిత్ర ‘సామాజిక న్యాయ మహాసమరం’ తెలుగులో కూడా అనువాదం అయింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్‌ ప్రముఖ పాత్ర వహించారు.


views: 643



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams