Current Affairs Telugu Daily

బిల్డ్ ఏపీ మిషన్

*సీఎం జగన్ మరో కీలక పథకం ప్రారంభించనున్నారు.దీనిద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
*ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 
* ఆ పథకం బిల్డ్ ఏపీ మిషన్.విజయవాడలో బిల్డ్ ఏపీ మిషన్ తొలి ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించారు.
*. పథకం అమల్లో భాగంగా నిధుల సమీకరణ కోసం రెండెకరాల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
*బిల్డ్ ఏపీ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న రెండెకరాల భూమిని విక్రయించే దిశగా చర్యలు చేపట్టింది.
* స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని విక్రయించే అవకాశం ఉంది.
* అధునాతన భవనాల కోసం.,కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశం.
*ఈ స్థలం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా.
*ఈ తరహా ప్రాజెక్టులు వస్తే అభివృద్ధితోపాటు ఉపాధి కల్పన కూడా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.
*ఎన్బీసీసీ సంస్థతో కలిసి బిల్డ్ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
*ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు వాటిని విక్రయించాలని నిర్ణయించింది. 
*బిల్డ్ ఏపీ మిషన్ డైరక్టర్ గా ప్రవీణ్ కుమార్


views: 671



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams