Current Affairs Telugu Daily

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విద్యా పురస్కారాలు 

ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నవంబర్ 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విద్యా పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించింది.
*జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
*భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు.
*2019 నవంబర్ 11న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 132వ జయంతి.
*అబుల్‌ కలాం విద్యా పురస్కారాలకు రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మొత్తం 189 మంది ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 47 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల నుంచి 45 మంది ఎంపికయ్యారు.
*విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రతిభావంతులకు విద్యాపురస్కారాలు అందించారు.


views: 614



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams