Current Affairs Telugu Daily

యుద్దం ముగియలేదు

*డొనాల్డ్‌ ట్రంప్‌ --అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని పేర్కొన్నారు.  
*సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్లు ట్రంప్‌  తెలిపారు.  చైనా ఆర్ధికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉండడం వల్ల చైనా ఒప్పందాల కొరకు  ప్రయత్నిస్తుంది. 
*గత వారం ఇరు దేశాల మధ్య సుంకాలను దశలవారిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్‌ ప్రకటించారు. 
* దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దానికి తెరపడినట్లేనని అంతా భావించారు. 
*ఇరు దేశాల మధ్య ఏడాదికి పైగా వాణిజ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ రెండేళ్లలో వందల బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి.


views: 675



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams