Current Affairs Telugu Daily

అయోధ్య తీర్పు 

*అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 9వ తేదీన కీలక తీర్పు వెలువరించింది.
* తీర్పు పాఠాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చదివారు. 
*నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నారు, పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు వెలువరించారు. 
*కోర్టు ముందు రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది, వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదు. 
*సమగ్రంగా తీర్పు --వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయి, మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం తెలిపింది. 
*అయోధ్యను రామజన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారు. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా పేర్కొనలేదు. 
* సుప్రీం కోర్టు తీర్పులో  రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాద అంశంగా పేర్కొన్నారు. 
* రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారు. మొఘుల కాలం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్‌ బోర్డు నిరూపించలేక పోయింది. 
*బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారని సీజేఐ పేర్కొన్నారు.12 నుంచి 16వ శతాబ్ధాల మధ్య ఏం జరిగిందనడానికి ఆధారాలు లేవు. 
*మసీద్‌ కింద ఆలయ అవశేషాలు ఉన్నట్లు ఏఎస్‌ఐ గుర్తించినట్లు సీజేఐ పేర్కొన్నారు.
* యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
*బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు. 
* నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది.
*అయోధ్యలో ముస్లింలకు ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. 
*1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది.
*వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొంది. 
*అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని తీర్పు ఇచ్చింది. 
* అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
*జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది.


views: 737



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams