Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన బుల్ బుల్ ముప్పు 

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగతున్న బుల్‌బుల్‌ తీవ్ర తుపాను నవంబర్ 8వ తేదీన దిశ మార్చుకుంది.
*ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
*ఉత్తరదిశగా పయనించిన  తీవ్ర తుపాను అతి తీవ్ర తుపానుగా మారి, ఈశాన్య దిశగా పయనించి క్రమంగా బలహీనపడింది. 


views: 668



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams