Current Affairs Telugu Daily

నాడు–నేడు

*నవంబర్ 14 వ తేదీన  ముఖ్యమంత్రి  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు నుంచి ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
*రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని దశల వారీగా చేపడతారు.
* రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశంలోనే ఆదర్శప్రాయంగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం.
* ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, తరగతి గదులు, బ్లాక్‌ బోర్డులు, ప్రహరీల వంటి మౌలిక వసతులు కల్పించేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించారు.
*మొదటి విడతగా రాష్ట్రంలో 15 వేల పాఠశాలలను ఎంపిక చేసి ప్రణాళికాబద్దంగా మరమ్మతులు చేపడ్డటం జరుగుతుంది.
*  వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా పాఠ్య పుస్తకాల్లో సంస్కరణలు తీసుకురానున్నారు.
* . 2020–21 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు, 2021–22 విద్యా సంవత్సరంలో 5 నుంచి 8వ తరగతి వరకు, 2022–23 లో 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదన ప్రారంభించనున్నారు.
*  ఇందుకోసం జనవరిలో 90 వేల మందికి ఇంగ్లిష్‌ బోధనపై ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తారు.
* ప్రకాశం జిల్లాలో  నాడు–నేడు కింద 1250 పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు.


views: 628Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams