Current Affairs Telugu Daily

విశాఖలో టైగర్‌ ట్రయాంఫ్‌ 

అమెరికా, భారత్‌ త్రివిధ దళాలు ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోని సాగ ర జలాల్లో విన్యాసాలు నిర్వహించనున్నాయి.
* నవంబర్ 14 నుంచి 8 రోజుల పాటు విశాఖలోని తూర్పునౌకాదళ ప్రధాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖ, కాకినాడ తీర ప్రాంతాల్లో విన్యాసాలు జరగనున్నాయి.
* ఇప్పటికే ఇరుదేశా ల రక్షణ, విదేశాంగ మంత్రులు దీనిపై చర్చలు జరిపారు. 
*ప్రధాన లక్ష్యం — రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడటంతో పాటు భద్రత, పరస్పర సహకారం, విపత్తుల వేళ పరస్పర తోడ్పాటు వంటి అంశాలను బలోపేతం చేసుకోవడం.
*ఈ ప్రతిష్టాత్మక విన్యాసాలను ‘టైగర్‌ ట్రయాంఫ్‌’ (పులి విజయం) పేరుతో నిర్వహించనున్నారు. 500 మంది అమెరికన్‌ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది దీనిలో పాల్గొనున్నారు.   
*ఇండో, పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి సంయుక్త విన్యాసాలు ఉపయోగపడతాయి.
* టైగర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాల కంటే ముందుగా.. భారత్, అమెరికా సంయుక్తంగా వివిధ దేశాలతో కలిసి యూఎస్‌–ఆసియా ఉమ్మడి సైనిక విన్యాసాలు, జపాన్, భారత్, ఫిలిప్పీన్స్‌తో సంయు క్తంగా కార్యక్రమాలు నిర్వహించాయి.
* భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ జలషా్వ, ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌తో పాటు అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ జర్మన్‌ టౌన్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.


views: 662



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams