Current Affairs Telugu Daily

ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌-2019 పురస్కారాలు

*ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌-2019కు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆరుగురు ఎంపికయ్యారు. 
*వీరిలో హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) చీఫ్‌ సైంటిస్టు మంజులా రెడ్డి ఉన్నారు.
*లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో ఆమెను ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఐ ఎస్‌ఎఫ్‌) ప్రకటించింది.
*ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ సునీతా సరవాగి, భౌతిక శాస్త్రంలో ఐఐఎ్‌ససీ బెంగళూరు ప్రొఫెసర్‌ జి.ముగేశ్‌, గణితంలో స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిచ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ సిద్ధార్థ మిశ్రా, హ్యుమానిటీ్‌సలో ఐఐటీ మండి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మను వి.దేవదేవన్‌, సోషల్‌ సైన్సె్‌సలో అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ఆనంద్‌ పాండ్యన్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
*జనవరి 7న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌.. వీరు ఒక్కొక్కరిని రూ.70.94 లక్షల (లక్ష డాలర్లు) నగదు పారితోషికం, బంగారు పతకం, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు.
*ఐఎస్ఎఫ్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి ఈ వివరాలను ప్రకటించారు.
*మంజులారెడ్డి పరిశోధన చేసిన అంశం -- 
*బ్యాక్టీరియా ఎలా వృద్ధి చెందుతుంది? ఎలా విభజన చెందుతుంది? అనే అంశాలపై పరిశోధనలకుగానూ సీసీఎంబీ చీఫ్‌ సైంటిస్టు మంజులారెడ్డికి ఇన్ఫోసిస్‌ అవార్డు దక్కింది. 
*సాధారణంగా బ్యాక్టీరియా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రెండుగా విభజన చెందుతూ ఉంటుంది. ఒక బ్యాక్టీరియా రెండుగా విడిపోవడానికి అవసరమైన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? ఈ క్రమంలో ఎలాంటి ఎంజైమ్‌లు విడుదల చేస్తాయి? అనే విషయాన్ని మంజులారెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. 
*బ్యాక్టీరియా కొత్త కణంగా ఏర్పడటానికి అవసరమైన వ్యవస్థల పని తీరును కనుగొనడం వల్ల కొత్త తరహా యాంటీ బ్యాక్టీరియా ఔషధాలను అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమమైంది.


views: 643



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams