Current Affairs Telugu Daily

‘ఇండియా జస్టిస్‌’ ర్యాంకింగ్స్‌

టాటా ట్రస్ట్‌ రూపొందించిన ‘ఇండియా జస్టిస్‌’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర నంబర్‌ 1 స్థానంలో నిలిచింది.తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13వ స్థానాలు దక్కాయి.
*ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి.
* పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరును తెలిపే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌  బి.లోకూర్‌ ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ నివేదిక రూపొందించింది.
*పోలీస్, ప్రిజన్స్‌, జ్యుడీషియరీ, లీగల్‌ ఎయిడ్‌ అనే నాలుగు కేటగిరీలకు వచ్చిన స్కోర్ల ఆధారంగా..  2015–16, 2016–17, 2017–18, 2018–19 సం వత్సరాల డేటా ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.
*పరిగణలోకి తీసుకునే అంశాలు—-ఆయా కేటగిరీల్లో బడ్జెట్, భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పని భారం అంశాల్లో మెరుగైన పనితీరుకు స్కోరు అందించారు. 
* నాలుగు కేటగిరీల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించారు.
*18 పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాలను ఒక విభాగంగా, 7 చిన్న రాష్ట్రాలను మరొక విభాగంగా చేసి ర్యాంకులు ప్రకటించారు.
*లీగల్‌ ఎయిడ్‌ అంశంలో మెరుగైన పనితీరుతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవగా.. పోలీస్‌ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలిచింది.

 


views: 636



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams