Current Affairs Telugu Daily

 బిమ్స్‌ టెక్‌ పోర్టుల సదస్సు

*బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దేశాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి నవంబర్ 7, 8 తేదీల్లో విశాఖపట్నంలో పోర్టుల సదస్సును నిర్వహిస్తున్నారు. 
*. బిమ్స్‌టెక్‌ పోర్టుల సదస్సు పేరిట నిర్వహించనున్న ఈ సదస్సుకు విశాఖపట్నం పోర్టు తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది.
*బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, నేపాల్‌, భూటాన్‌తో పాటు భారత్‌ ఇందులో సభ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి.
*ఈ దేశాల్లోని ప్రభుత్వ పోర్టులతో పాటు ప్రైవేటు పోర్టుల యాజమాన్యాలు కూడా సదస్సుకు హాజరవుతున్నాయి. 
*కేంద్ర షిప్పింగ్‌ శాఖా మంత్రి  — మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవీయ
* బహుళ ఉత్పత్తులు, పెట్టుబడులు, స్వేచ్ఛా వాణి జ్యం, పర్యాటకం, తీర ప్రాంత భద్రత తదితర అంశాలపై చర్చిస్తారు. పలు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు జరుగుతాయి.

*


views: 698



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams