Current Affairs Telugu Daily

రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి

* రియల్టీ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.
*ఎన్‌పీఏ ఎన్‌సీఎల్‌టీ ప్రకటించని సంస్థలకు మాత్రమే అనే నిబంధనను తాజాగా తొలగించారు. తద్వారా  మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది. 
*దీని ద్వారా సంబంధిత ప్రాజెక్ట్‌ పూర్తి కావడానికి  సాయపడుతుంది.  
*ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ - ఇందుకోసం రూ .25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నారు.
*ఇందులో కేంద్ర 10వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్‌ చేస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిధులను సమకూర్చనుంది. 
*నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలుగా రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూర్చుతుంది.
*దీని ద్వారా అందుబాటు ధరలు, మధ్య ఆదాయ హౌసింగ్‌ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలు కలగనుంది. 
*నగదు కొరత కారణంగా నిలిచిపోయిన, రెరాలో నమోదైన ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం లభించనుంది. 
*. ఈ నిధిని ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తారు. ఈ నిధి మూలంగా దాదాపు 3.5 లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుంది.
*ఎన్‌పీఏ, ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన హౌసింగ్‌ ప్రాజెక్టులకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
*1,600 రియాల్టీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతోభారతదేశంలో సుమారు 4.58 లక్షల హౌసింగ్ యూనిట్లు ఇబ్బందులు పడుతున్నాయి.


views: 653



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams