Current Affairs Telugu Daily

తెలంగాణా కు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్  అవార్డులు 

*గవర్నెన్స్ నవ్ సంస్థ ఆధ్వర్యంలో అందించే అవార్డులకుగానూ ఐదు క్యాటగిరీల్లో తెలంగాణ ఐటీశాఖ ఎంపికైంది. 
*1.మొబైల్ యాప్ కేటగిరిలో టీ-యాప్ ఫోలియో, 
2.అడాప్షన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ క్యాటగిరీలో టీ-వ్యాలెట్, 
3.డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ సర్వీసెస్ క్యాటగిరీలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ కార్డ్, 
4. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ క్యాటగిరీలో టీ-సాట్ నెట్‌వర్క్ చానెల్, 
5.ఎండ్ టూ ఎండ్ సర్వీస్ డెలివరీ క్యాటగిరీలో గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్‌లు ఎంపికయ్యాయి. 
*న్యూఢిల్లీలో జరిగిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్-2019లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. 
*రాష్ట్ర పోలీసులు తీసుకొస్తున్న డిజిటల్ పోలీసింగ్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్ ఫర్ ఈ-కాప్, హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌కు అవార్డులు లభించాయి.
*.ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్స్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుల కార్యక్రమం నిర్వహించారు.
*నిర్మల్‌ జిల్లాలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్ర యోగాత్మకంగా రైతుయంత్ర యాప్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌ సక్సెస్‌తో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ జిల్లాకు అవార్డును అందించింది.


views: 628



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams