Current Affairs Telugu Daily

మిషన్ కర్నూల్ 

*విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా యంత్రాంగం నిర్ధారించుకుంది.
*ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం జిల్లా యంత్రాంగం.. మిషన్‌ కర్నూలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకాధికారులు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. రాత్రి బస చేయడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై  దృష్టి సారిస్తారు.
*వారంలో ప్రతిరోజు ఒక్క పాఠశాలను, ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఆ సమయంలో వచ్చిన సమస్యలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందజేస్తే వారాంతరం జరిగే సమీక్ష సమావేశంలో వాటికి పరిష్కారం చూపుతారు. ఏదైనా పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీకి వెళితే అక్కడ విద్యార్థులు తమకు తాగునీరు లేదని, మరుగుదొడ్లు పనిచేయడంలేదని, తరగతి గదుల కొరత ఉందని చెబితే వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు.
*ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 500 రకాల మాత్రలు, పారిశుద్ధ్యం, వైద్య పరికారాలు అందుబాటులో లేకపోతే కల్పించానికి చర్యలు తీసుకుంటారు. అలాగే గత సమీక్ష సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలపై లోతైనా విశ్లేషణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
*జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో నామమాత్రపు వైద్యం అందుతోంది. రోడ్డు ప్రమాదాల బాధితులకు వైద్యం సక్రమంగా అందడంలేదు. ప్రాథమిక చికిత్స చేసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఆదోని ఏరియా ఏసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఏరియా ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచాల్సి ఉంది. కర్నూలు పెద్దాసుపత్రిలో ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌ సేవలను విస్తృత పరచాలి.
*మిషన్‌ కర్నూలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పదో తరగతిలో వంద శాతం ఫలితాలను సాధించేందుకు నిర్ణయం తీసుకున్నారు.


views: 613



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams