Event-Date: | 06-Nov-2019 |
Level: | International |
Topic: | Sports and Games |
మను బాకర్ పసిడి పతకం
*భారత షూటర్ మను బాకర్ ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఖతర్‌లో నిర్వహిస్తున్న 14వ ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 244 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించిందిచింది.
*మునిచ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందున టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత పొందింది.
*భారత మరో షూటర్ యశస్విని సింగ్ ఆరో స్థానంలో నిలిచింది.
*పురుషుల విభాగంలో ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ దీపక్ కుమార్ 227 పైచిలుకు పాయింట్లతో కాంస్యాన్ని కైవసం చేసుకుని టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించాడు.
*మొత్తంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ తరపున మహిళలు 45మంది, పురుషులు 63మంది బరిలో నిలిచారు. వీరంతా పిస్టల్, రైఫిల్, షాట్‌గన్ విభాగాల్లో పోటీపడనున్నారు.