Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి సీఎస్‌ నియామకం 

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. సీఎస్‌గా ఉన్న ఎల్వీ తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్‌కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది.
*ఎల్వీ సుబ్రహ్మణ్యంను  మరో ఐదునెలల సర్వీసు ఉండగానే బదిలీ చేయడం జరిగింది.సుబ్రహ్మణ్యం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
*ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఎల్వీ సుబ్రమణ్యం తాత్కాలిక సీఎస్ నీరబ్‌కుమార్‌కు అప్పగించారు. 


views: 629



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams