Current Affairs Telugu Daily

ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడి ఎన్నిక

*ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) అధ్యక్షుడిగా ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు.ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్న దేవులపల్లి అమర్‌ ఇటీవల ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు.ముఖ్యమంత్రి అభీష్టం ఉన్నంత ఉన్నంతవరకూ అమర్‌ ఈ పదవిలో కొనసాగుతారు. 
*ఢిల్లీలో జరిగిన ఐజే యూ జాతీయ కార్యవర్గ కమిటీ అత్యవసర సమా వేశం అమర్‌ రాజీనామాను ఆమోదించింది. అమర్ రాజీనామా చేయడంతో ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌కు ఎన్నిక చేపట్టారు. 
* ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి, 
సెక్రటరీ జనరల్‌గా బల్విందర్‌ సింగ్‌ (జమ్మూ) ఎన్నికయ్యారు. బల్విందర్‌ సింగ్‌ పంజాబ్‌ ట్రిబ్యూన్‌ స్పెషల్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు.


views: 605



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams