Event-Date: | 06-Nov-2019 |
Level: | International |
Topic: | Foreign relations |
అమెరికా తిరస్కరణ
*అమెరికాలో పనిచేసేందుకు మంజూరు చేసే వర్క్ వీసాల (హెచ్–1బీ) విషయంలో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) నిబంధనలను కఠినతరం చేసింది.
*2017లో మొత్తం దరఖాస్తుల్లో 13 శాతం తిరస్కరణకు గురవగా ఈ ఆర్థిక సంవత్సరం (అక్టోబర్ 2018–సెప్టెంబర్–2019) మొదటి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్ 18)లో ఏకంగా 32 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం
*మొదటి త్రైమాసికంలో భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 శాతం నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి.
* ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో యాపిల్, ఫేస్‌బుక్‌లు సమర్పించిన హెచ్1బీ దరఖాస్తుల్లో 99 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. అలాగే గూగుల్ 2 శాతం, మైక్రోసాఫ్ట్ 5 శాతం, అమెజాన్ 3 శాతం, ఇంటెల్ 8 శాతం హెచ్1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
*ఈ ఆరు ప్రధాన కంపెనీలు సమర్పించిన హెచ్1బీ దరఖాస్తుల్లో 67 శాతం భారతీయులవే కాగా వాటిలో 65 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది.
*2009లో ఆరు శాతం రెన్యువల్ దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా 2019కు వచ్చేసరికి అది 18 శాతానికి పెరిగింది.
*భారతీయ కంపెనీల హెచ్1బీ దరఖాస్తులు అత్యధికంగా తిరస్కరణకు గురికావడమే కాకుండా ఎల్–1 వీసాలను సైతం తక్కువ సంఖ్యలో ఇస్తున్నారు.
*అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంగల అమెరికన్లు లేకపోవడం వల్ల ఆయా సంస్థలు భారతీయ నిపుణులను నియమించుకుంటున్నాయి. అయితే వారికి వర్క్ వీసాలు లభించకపోవడంతో ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవడం, ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించని కారణంగా భారతీయ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి.
*‘ఎల్–1 వీసాలపై అమెరికా వస్తున్న ఉద్యోగులను కంపెనీలు టెక్నాలజీ అవసరాలకు కాకుండా ఇతర వ్యాపారాలకు వాడుకుంటున్నాయి. అందుకే ఈ వీసాల తిరప్కరణ చేస్తున్నట్టు అమెరికా చెబుతుంది.
*సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం, ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరిన ఇతర సమాచారం అందించడంలో వైఫల్యం వల్ల కూడా ఈ వీసాలు ఆమోదం లభించడంలేదు.
*అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తమ ఆఫీసులు లేదా క్లయింట్ల దగ్గర పని చేయడానికి భారతీయ కంపెనీలు ఉద్యోగులను ఎల్–1 వీసాలపై (తాత్కాలిక బదిలీపై అమెరికాలో పని చేయడానికి ఉద్దేశించిన వీసాలు) పంపుతుంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తమ ఆఫీసులు లేదా క్లయింట్ల దగ్గర పని చేయడానికి భారతీయ కంపెనీలు ఉద్యోగులను ఎల్–1 వీసాలపై (తాత్కాలిక బదిలీపై అమెరికాలో పని చేయడానికి ఉద్దేశించిన వీసాలు) పంపుతుంటాయి.
*భారతీయ కంపెనీలు 2018లో ఎల్–1 వీసా కోసం చేసిన దరఖాస్తుల్లో 77.8 శాతం ఆమోదం పొందగా 2019 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్– డిసెంబర్ 18) మొదటి త్రైమాసికంలో 71.9 శాతం దరఖాస్తులనే ఆమోదించింది.