Event-Date: | 05-Nov-2019 |
Level: | International |
Topic: | Awards and honours |
డీఏఎఫ్ఓహెచ్ సంస్థకు మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్
*డీఏఎఫ్ఓహెచ్ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ లభించింది.
*బలవంతపు అవయవ సేకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్న డాక్టర్స్ ఎగైనెస్ట్ ఫోర్స్డ్ ఆర్గాన్ హార్వెస్టింగ్(డీఏఎఫ్ఓహెచ్) సంస్థకు ప్రతిష్ఠాత్మక మదర్ థెరీసా మెమోరియల్ అవార్డ్ దక్కింది.
*ఈ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుండి పనిచేస్తుంది.2006లో దీనిని ప్రారంభించారు.
*ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
*సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ టార్స్టెన్ ట్రే ఈ అవార్డును అందుకున్నారు.
*మదర్ థెరీసా జ్ఞాపకార్థం సామాజిక సేవలో ముందున్న సంస్థలకు Harmony foundation వాళ్ళు ఏటా అవార్డులు అందిస్తున్నారు.
ఈ సంవత్సరం థీమ్ — Combating Contemporary Forms of Slavery
*అమెరికాకు చెందిన డీఏఎఫ్ఓహెచ్ దశాబ్దకాలంగా బలవంతపు అవయవాల సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కొంతమంది వైద్యులు, సర్జన్లు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
*చైనాలో ఖైదీల నుంచి బలవంతంగా అవయవాల సేకరించడంపై తీవ్రంగా పోరాడింది.ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి విజయం కూడా సాధించింది.
* 2016, 2017లలో వరుసగా రెండేళ్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది.