Current Affairs Telugu Daily

జీడీపీ పై ఎస్బీఐ తాజా నివేదిక

*సంస్కరణలు ప్రవేశపెడుతున్న, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లోనూ జీడీపీ కోలుకునే అవకాశాలు లేవని ఎస్బీఐ తాజా నివేదిక ద్వారా తెలుస్తున్నది.
*గతంతో పోల్చితే మరింత తగ్గే అవకాశం ఉంది.ఎస్బీఐ నివేదిక ప్రకారం ఈసారి 5 శాతానికి దిగువనే వృద్ధిరేటు ఉండవచ్చు. 
*2012-13 నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో 4.3 శాతంగా నమోదైంది. తాజా అంచనా ఆ స్థాయిని తాకుతున్నది. 
* ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ ఆరు సంవత్సరాల కనిష్ఠాన్ని( 5 శాతం)తాకింది. 
*అంతకుముందు త్రైమాసికంలో 5.8 శాతంగా ఉన్నది. 
*పడిపోయిన వినియోగ సామర్థ్యం, క్షీణించిన పెట్టుబడులు, సేవా రంగంలో మందగమనం వంటివి జీడీపీ వృద్ధిని  అడ్డుకుంటున్నాయి. 
* మొత్తం 26 సూచీల్లో 5 మాత్రమే మెరుగ్గా ఉన్నాయి.సెప్టెంబర్‌లో రూ.3.1 లక్షల కోట్లు ప్రభుత్వం ద్వారా ఖర్చు చేయడం ద్వారా అక్టోబర్-డిసెంబర్‌లో జీడీపీ కాస్త కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
*ఈ జూలై-సెప్టెంబర్‌కుగాను దేశ వృద్ధిరేటు 5 శాతం లోపే ఉండొచ్చని నొమురా అంచనా వేసింది.మూడీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంగా 5.8 శాతం జీడీపీ నమోదు కావచ్చని అంచనా వేసింది.
* ఎస్బీఐ కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ 6 శాతం లోపే ఉంటుందని అంచనా వేసింది. 


views: 635



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams