Event-Date: | 05-Nov-2019 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |
దేశంలో పనిగంటల ముసాయిదా
*కేంద్రం తాజాగా వేతన స్మృతి ముసాయిదా నిబంధనలను రూపొందించింది.దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.అదే సమయంలో జాతీయ కనీస వేతనాన్ని తనకు తానుగా ఖరారు చేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు.
*వేతనాన్ని నిర్ధారించేందుకు నెలకు 26 రోజులు, ఎనిమిది గంటల చొప్పున లెక్కిస్తారు. ఇప్పటికే చాలా ఫ్యాక్టరీల్లో 9 గంటల షిఫ్ట్ నడుపుతున్నారు. దీన్ని సాధారణీకరించే యోచనలో కేంద్రం ఉంది.
*నిపుణుల కమిటీ కనీస వేతనాలను నిర్ణయించనుంది.
*‘సాధారణ కూలీకి రూ.375 ఇవ్వాలని కార్మిక శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. దాని ప్రకారం 26 రోజులకు 9750 అవుతుంది.
*నగరంలో ఉండే కార్మికులకు ఇంటి అద్దె అలవెన్స్‌గా మరో రూ.1430 చేర్చి కనీస వేతనం ఇవ్వాలని కొందరు భావిస్తున్నారు.
*బీఎంఎస్ జాతీయాధ్యక్షుడు సాజీ నారాయణన్ --కనీస వేతనం సరైన ప్రాతిపదిక కాదు. కుటుంబ నిర్వహణ వేతనమే సరైన అంచనా. పని గంటలను ఆరుకు తగ్గించాలి.
*కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు భౌగోళికంగా దేశాన్ని మూడు భాగాలుగా వర్గీకరిస్తారు.
* 40 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతాలను మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా, 10 లక్షల నుండి 40 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలను నాన్ మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా వర్గీకరిస్తారు.
*కేంద్రం తీసుకువచ్చిన ముసాయిదాలో ఇంటి అద్దె పది శాతం గా పేర్కొన్నారు. కానీ దేశ భౌగోళిక వర్గీకరణను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే అంశం పై వివరణ ఇవ్వలేదు.
*ఆహారం మరియు బట్టల ఖర్చులో 10% ఇంటి అద్దె అనేది వాస్తవానికి దూరంగా ఉంది.