Current Affairs Telugu Daily

జపాన్‌,మయన్మార్‌ ప్రతినిధులతో మోడీ సమావేశం 

*భారత్, జపాన్‌ చర్చలు—--ఇండో పసిఫిక్‌ ప్రాంత దేశాల ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, సమృద్ధి, అభివృద్ధిల కోసం కలసి కట్టుగా కృషి చేయాలని భారత్, జపాన్‌ దేశాలు నిర్ణయించాయి. ఈస్ట్‌ ఆసియా సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షింజొ అబె సోమవారం భేటీ అయ్యారు.
*ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మిలటరీపరంగా, వాణిజ్యపరంగా చైనా విస్తరణవాద పాటు ఈ ప్రాంత భద్రత, వాణిజ్యం తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు సమీక్ష నిర్వహించారు.
జపాన్అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.
జపాన్ దేశంలో సుమారు 3,000 పైగా దీవులు ఉన్నందున ఇది నిజానికి ఒక ద్వీపకల్పం. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు హోన్షూ, హొక్కయిడో, క్యూషూ మరియు షికోకూ కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే.

భారత-మయన్మార్‌ చర్చలు-భారత-మయన్మార్‌ సరిహద్దుల వెంబడి వెలసిన వేర్పాటువాద గ్రూపుల నిర్మూలనలో పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ ఆ దేశ స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌ సాన్‌ సూచీకి ప్రతిపాదించారు. 
*ఆగ్నేయాసియా కూటమి సమావేశాలకు హాజరైన సమయంలో ఇద్దరు నేతలూ సమావేశమయ్యారు.
* ఈశాన్య రాష్ట్రాలతో దాదాపు 1640 కిలోమీటర్ల పొడవున ఉన్న సరిహద్దుల్లో 50కి పైగా వేర్పాటువాద గ్రూపులు పనిచేస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు రెండు దేశాల సైన్యాలు ఇప్పటికే పలుమార్లు ఉమ్మడిగా దాడులు జరిపాయి.
* బౌద్ధులు- రోహింగ్యాలకు మధ్య దాదాపు ఎనిమిదేళ్లుగా ఉధృతంగా సాగుతున్న ఘర్షణల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు.
*మయన్మార్‌ సైన్యం కూడా రోహింగ్యాలపై దాడులకు పాల్పడింది. ఏడు లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలస పోయారు. అక్కడి నుంచి భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోకి వారు చేరుకుని స్థిరపడుతుండడం జరుగుతుంది.
* రోహింగ్యాలకు తిరిగి రాఖైన్‌లో అవకాశమిస్తే భారత్‌, బంగ్లా, మయన్మార్‌ భద్రంగా ఉండే అంశాన్ని మోది సూచించారు.


views: 614



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams