Event-Date: | 05-Nov-2019 |
Level: | International |
Topic: | Economic issues |
స్వేచ్ఛా వాణిజ్యం వద్దు -ఆర్సెప్ ఒప్పందంలో చేరేందుకు భారత్ నిరాకరణ
ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’’ (ఆర్సెప్) ఒప్పందంలో చేరేందుకు భారత్ నిరాకరించింది.ఆర్సెప్ ఒప్పంద మూలస్వభావం మారడం, ఈ ఒప్పందం విషయంలో భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోకపోవడం వల్ల ఆర్సెప్ ఒప్పందంలో చేరడానికి భారత్ నిరాకరించింది.
* దేశంలోకి చైనా దిగుమతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
*బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆర్సెప్ ఒప్పందం ఖరారు కావాలి. భారత్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందం 2020కి వాయిదా పడే అవకాశం ఉంది.
*భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా 16 దేశాల మధ్య ఆర్సెప్ ఒప్పందం కుదరాల్సి ఉంది.
* ప్రపంచంలోని సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. ఆర్‌సెప్‌పై సంతకం చేయడానికి మిగతా దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయి, కానీ భారత్ మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది.
*భారత్ అభిప్రాయం--దేశీయ మార్కెట్‌ను సంరక్షించుకోవడం ,చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్లోకి విపరీతంగా వచ్చి పడకుండా చూసుకోవడం, దేశీయ ఉత్పత్తుల మార్కెట్‌కు సముచిత రక్షణ కల్పించడం లక్ష్యం.
*చైనా అభిప్రాయం --అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది.అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం కొరకు చైనా ప్రయత్నిస్తుంది.
*ఈ ఆర్సెప్ ఆమోదం పొందితే ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40%, ప్రపంచ జీడీపీలో 35% ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి.
*విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్
*ఆర్సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి.
*‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి.
*తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో- ఉగ్రవాదానికి, అతివాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేయాలని 18 దేశాల అధినేతలు నిర్ణయించారు.