Current Affairs Telugu Daily

మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ వరల్డ్‌చాంపియన్‌

*ఫార్ములావన్‌ లో బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరొకసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 
*యూఎస్‌ గ్రాండ్‌ ప్రిలో రెండో స్థానంలో నిలిచిన హామిల్టన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించాడు.ఫార్ములావన్‌ కెరీర్‌లో హామిల్టన్‌ వరల్డ్‌చాంపియన్‌గా నిలవడం ఆరోసారి. 
* అర్జెంటీనాకు చెందిన జువాన్‌ మాన్యుల్‌ ఫాంగియో రికార్డును హామిల్టన్‌ బ్రేక్‌ చేశాడు.ఫాంగియో ఐదుసార్లు వరల్డ్‌చాంపియన్‌గా నిలవగా ఆ రికార్డును హామిల్టన్‌ బద్దలు కొట్టాడు. 
*ఫార్ములావన్‌లో అత్యధికంగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ గెలిచిన జాబితాలో జర్మన్‌కు చెందిన మైకేల్‌ స్కూమచర్‌ ఉన్నాడు. స్కూమచర్‌ ఏడుసార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ గెలిచాడు.  
*యూఎస్‌ గ్రాండ్‌ ప్రి తర్వాత హామిల్టన్‌ 381 పాయింట్లు సాధించి ఈ సీజన్‌లో టాప్‌లో నిలిచాడు.
*మొత్తం 21 ఫార్ములావన్‌ రేసుల్లో హామిల్టన్‌ పదింటిని గెలుచుకున్నాడు.
*ఇది హామిల్టన్‌కు వరుసగా మూడో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కాగా,  అంతకుముందు 2008, 2014, 2015 సంవత్సరాల్లో కూడా హామిల్టన్‌ ప్రపంచ చాంపియన్‌ టైటిల్స్‌ సాధించాడు.


views: 651Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams