Current Affairs Telugu Daily

దక్షిణాసియా పురోగమనానికి సిద్ధంగా ఉందా? స్థిర సమగ్రాభివృద్ధి అజెండాను సంతరించుకుంటుందా?

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా గణాంకాలు---
* భారతదేశం సారథ్యంలో దక్షిణాసియా ఇప్పుడు ప్రపంచ వృద్ధి కేంద్రంగా ఎదిగేందుకు ముందుకు సాగుతుందని ఐఎంఎఫ్ తాజా గణాంకాలు చెబుతున్నాయి.
*ఐఎంఎఫ్ ప్రకారం,దక్షిణాసియాలో సరళీకరణ విధానాల అమలు, వౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి పెరుగుతున్న కృషి, పనిచేసే సత్తా ఉన్న యువ జనాభా కారణంగా ఈ ప్రాంతం 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు వాటాను అందుకోగలదు.  
* భౌగోళిక విభజనల పరిధిలో చూస్తే ఐఎంఎఫ్ జాబితాలోకి అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లను చేర్చలేదు. 
* భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులను దక్షిణాసియా దేశాలుగా భౌగోళికంగా వర్గీకరించుకున్నారు.
*దక్షిణాసియా పురోగమనానికి సిద్ధంగా ఉందా? స్థిర సమగ్రాభివృద్ధి అజెండాను సంతరించుకుంటుందా? అనే శీర్షికతో ఐఎంఎఫ్ ఒక విశ్లేషణాత్మక పత్రాన్ని రూపొందించింది.
*ఇతోధిక సంస్కరణల ప్రక్రియలు, దీనికి తోడుగా మౌలిక సాధనాసంపత్తిని ఇనుమడింపచేసుకోవడం, ఈ ప్రాంతపు యువశక్తిని, అసంఖ్యాక శ్రామికశక్తిని సరైన విధంగా వినియోగించుకోవడం వంటి పరిణామాలు కీలకంగా మారాయి. 
*భారతదేశపు నాయకత్వంలో దక్షిణాసియా 2040నాటికి గణనీయ పాత్ర ను పోషిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 
*ఐఎంఎఫ్ ప్రకారం, ఆసియా ఖండం లో పలు చోట్ల ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నా,ప్రత్యేకించి దక్షిణాసియా అందరిని ఆకర్షిస్తోంది. 
*ఐఎంఎఫ్ పరిశోధన ప్రకారం, దక్షిణాసియా లో 2030 నాటికి 150 మిలియన్ మంది లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారు. 
*ఐఎంఎఫ్ ఆసియా అండ్ పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ -- అన్నీ మేరీ గుల్డీ వోల్ఫ్.


views: 642



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams