Current Affairs Telugu Daily

16వ ఆసియాన్​-భారత్​ సదస్సు

*మూడు రోజుల పర్యటనలో భాగంగా  ప్రధాని మోదీ థాయ్‌లాండ్​లోని బ్యాంకాక్​లో 16వ ఆసియాన్​-భారత్​ సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. 
*ఆసియాన్​ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారతదేశం సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాని మోడీ తెలిపారు. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ​ఏకాభిప్రాయంతో ఉన్నాయి. 
* బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
*థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్​ ప్రయూత్​ చాన్​ ఓ చాన్​తో ప్రధాని నరేంద్రమోదీ  భేటీ అయ్యారు.ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మయన్మార్​ కౌన్సిలర్​ అంగ్​సాన్​ సూకీతోనూ సమావేశమయ్యారు.
*ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి కొరకు భారత్ ప్రయత్నిస్తుంది. 
*రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చనోచా అంగీకరిం చారు. 
*1. బ్యాంకాక్‌ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను,
 2.థాయ్‌లాండ్‌లోని రణోంగ్‌ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత కల్పించనున్నారు.  
ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందం ఈసారి కూడా ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు.16 ఆసియా, పసిఫిక్‌ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి ఏర్పాటవుతున్నది.ఇది ప్రపంచ జీడీపీలో 30 శాతం, ప్రపంచ జనాభాలో సగభాగం కలిగి ఉన్నది. 
*వచ్చే ఏడాది వియత్నాంలో జరిగే ‘ఆసియాన్‌' సదస్సు సందర్భంగా ఆర్‌సీఈపీపై సంతకం చేసేందుకు సభ్య దేశాలు కట్టుబడి ఉన్నాయి. 
* చైనా నుంచి పోటెత్తే చౌక ఉత్పత్తులతో దేశంలోని చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 
*అన్ని పక్షాలకు అర్థవంతమైన మార్కెట్‌ను కల్పించాలనేది భారత్ వాదన .
ఆర్‌సీఈపీని ఆయుధంగా చేసుకుని భారత్‌లోకి చైనా చౌక ఉత్పత్తులను డంప్‌ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్‌లోని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, చిన్న పరిశ్రమలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందలో తగిన రక్షణలు కల్పించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తున్నది.  
* 10 ఆసియాన్‌ దేశాలతోపాటు భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణకొరియా మధ్య ఆర్‌సీఈపీ ఒప్పందానికి సంబంధించి ఏడు సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి.
* ఆర్‌సీఈపీలో భారత్‌ చేరితే, ఆసియాన్‌, జపాన్‌, దక్షిణకొరియాకు చెందిన 90 శాతానికిపైగా ఉత్పత్తులకు, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన 74 శాతానికిపైగా ఉత్పత్తులకు సుంకాలను తొలిగించాల్సి ఉంటుంది.
Hint to remember asian countries - TV CLIP of MBBS -Thailand ,Vietnam,Cambodia,Laos,Indonesia,Philippines,Malaysia, Burma (Myanmar),Brunei, Singapore


views: 649Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams