Current Affairs Telugu Daily

తగ్గిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు

*కేంద్ర ప్రభుత్వ నివేదిక --- వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు తగ్గాయి.అక్టోబర్ నెలకుగాను రూ. 95,380 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.  
*2018 నెలలో వసూలైన రూ.1,00,710 కోట్లతో పోలిస్తే 5.29 శాతం తక్కువ. 
* లక్ష కోట్ల కంటే తక్కువగా వసూలవడం ఇది వరుసగా మూడోనెల. 
*గత నెలలో వసూలైన రూ.95,380 కోట్లలో సీజీఎస్టీ కింద రూ.17,582 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.23,674 కోట్లు, ఐటీఎస్టీ కింద రూ.46,517 కోట్లు(దిగుమతులపై వసూలైన రూ.21,446 కోట్లు కలుపుకొని), సెస్ రూపంలో రూ.7,607 కోట్లు(దిగుమతులపై విధించిన రూ.774 కోట్లు కలుపుకొని) వసూలయ్యాయి. 
*ఈ పన్ను వసూళ్ల ద్వారా కేంద్రానికి రూ.38,224 కోట్ల నిధులు సమకూరగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.37,645 కోట్లు లభించాయి.
*ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లతో ఆఫ్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేవారు ఆన్‌లైన్ లో కొనడం వల్ల  వసూళ్లు తగ్గాయి.
*ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 37 శాతం మాత్రమే వసూలు చేసింది.. గడిచిన ఐదేండ్లలో ఇదే అత్యల్పం. 
*2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.16.49 లక్షల కోట్ల పన్ను వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా తొలి ఆరు నెలల్లో కేవలం రూ.6.07 లక్షల కోట్లు వసూలయ్యాయి.
* ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు గత ఐదు సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్నాయి.
*సెప్టెంబర్ 30తో ముగిసిన కాలానికిగాను వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి.
*తెలంగాణ రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లను పెంచేందుకు స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడంతోపాటు 130 కొత్త వాహనాలను కేటాయించారు. 


views: 621



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams