Event-Date: | 03-Nov-2019 |
Level: | National |
Topic: | Foreign relations |
ఏంజెలా మెర్కెల్ భారత్ పర్యటన -20కి పైగా ఒప్పందాలు
*జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల భారత పర్యటన పూర్తయింది.
*పర్యటనలో భాగంగా భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని మోదీ మరిన్ని చర్యలు తీసుకున్నారు.
* వ్యూహాత్మక భాగస్వామ్యంతో సాగే పలు రంగాలైన రక్షణ, ఇంధనం, కృత్రిమ మేధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు.
*అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజీసీ) నేతృత్వం వహించిన ఇరువురు పాకిస్తాన్కు హెచ్చరికలు పంపారు.
*నరేంద్రమోదీ, ఏంజెలా మెర్కెల్ చర్చలు పూర్తయ్యాక ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
*ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని, ప్రపంచ దేశాలన్నీ తమతో చేతులు కలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
*కృత్రిమ మేథ, విద్య, వ్యవసాయం, మెరైన్ టెక్నాలజీ సహా పలు రంగాల్లో భారత్, జర్మనీలు 20కి పైగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి.కృత్రిమ మేథలో పరిశోధన, అభివృద్ధి, గ్రీన్ అర్బన్ మొబిలిటీ సహా పలు వ్యూహాత్మక ప్రాజెక్టులకు సంబంధించి ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.
*పౌర విమానయానం, స్మార్ట్ సిటీల నెట్వర్క్, వృత్తివిద్యా రంగంలో పరిశోధనలు వంటి రంగాల్లోనూ పరస్పర సహకారానికి అంగీకారం కుదిరింది.
* ఆయుర్వేదం, ధ్యానం, యోగా వంటి అంశాల్లోనూ ఇరు దేశాలు విద్యా పరమైన తోడ్పాటుకు అంగీకరించాయి.
*భారత్లోని నగరాల్లో హరిత రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఒక బిలియన్ యూరోల సాయాన్ని మెర్కెల్ ప్రకటించారు.
*స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ వాడిన కేవీ రత్నం పెన్నును నరేంద్ర మోడీ మెర్కల్కు బహూకరించారు.
* రాజమండ్రికి చెందిన కేవి రత్నం ఇంక్ పెన్నును తయారు చేసి అప్పట్లో గాంధీకి ఇచ్చారు.1934లో రత్నం ఈ పెన్నును రూపొందించారు.
* గాంధీ రాసిన 31వేల లేఖల్లో చాలా వరకు లేఖలు ఆ ఇంక్ పెన్నుతోనే రాశారు. పిన్ను అయినా పెన్ను అయినా స్వదేశీ తయారీ ఉండాలని మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కేవీ రత్నం అప్పట్లో ఆ పెన్నును డిజైన్ చేశారు.
*జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్యగా మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ భూభాగం సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశంగా లెక్కింపబడింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చిన వలస ప్రజలకు మూడవ అతిపెద్ద నివాసదేశంగా ఉంది.