Current Affairs Telugu Daily

పాస్ పోర్ట్  లేకుండా కర్తార్‌పూర్‌ కారిడార్‌కు అనుమతి 

*పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ --క‌ర్తాపూర్ కారిడార్ మీదుగా పాక్‌లోకి వ‌చ్చే సిక్కు యాత్రికుల‌కు పాస్‌పోర్ట్ అవ‌స‌రం లేదు. గుర్తింపు పొందిన ఏదైనా ఐడీ కార్డు  ఉంటే సరిపోతుంది 
*యాత్ర‌కు వ‌చ్చే యాత్రికులు త‌మ టూర్ క‌న్నా ప‌ది రోజుల ముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.
*ప్రారంభోత్స‌వం రోజున మాత్రం సిక్కుల‌కు ఎటువంటి ఎంట్రీ ఫీజు ఉండదు.
*కర్తాపూర్ కారిడార్‌కు సంబంధించి  ఒప్పందంపై భార‌త్‌, పాక్‌లు సంత‌కం చేశాయి. 
*సిక్కుల మ‌త గురువు గురు నాన‌క్‌కు చెందిన గురుద్వారా ద‌ర్బార్ సాహిబా ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ఉన్న‌ది. 
*ప్ర‌తి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ వ వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమ‌తి ఇచ్చింది. గురు నాన‌క్ త‌న చివ‌రి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లోనే గ‌డిపారు. గురునానక్ దీనిని 1522 లో స్థాపించారు.
*పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న న‌రోవ‌ల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్న‌ది.
*ఇది అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.
*యాత్ర‌కు వ‌చ్చే ప్ర‌తి యాత్రికుడు 20 డాల‌ర్లు ఎంట్రీ ఫీజు చెల్లించాల‌ని పాక్ నిర్ణయించింది.కానీ ప్రారంభోత్స‌వం రోజున మాత్రం యాత్రికుల‌కు ఆ ఫీజును మిన‌హాయించారు.


views: 611



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams