Current Affairs Telugu Daily

తగ్గిన జీఎస్టీ వసూళ్లు
* వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్ నెలకుగాను రూ. 95,380 కోట్లు మాత్రమే వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
* 2018 లో ఇదే నెలలో వసూలైన రూ.1,00,710 కోట్లతో పోలిస్తే 5.29 శాతం తక్కువ.
* లక్ష కోట్ల కంటే తక్కువగా వసూలవడం ఇది వరుసగా మూడోనెల.
*  సెప్టెంబర్‌లో వసూలైన రూ.91,916 కోట్లతో పోలిస్తే మాత్రం ఆ మరుసటి నెలలో పెరుగడం విశేషం.
* గత నెలలో వసూలైన రూ.95,380 కోట్లలో సీజీఎస్టీ కింద రూ.17,582 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.23,674 కోట్లు, ఐటీఎస్టీ కింద రూ.46,517 కోట్లు(దిగుమతులపై వసూలైన రూ.21,446 కోట్లు కలుపుకొని), సెస్ రూపంలో రూ.7,607 కోట్లు(దిగుమతులపై విధించిన రూ.774 కోట్లు కలుపుకొని) వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
* కేంద్రానికి రూ.38,224 కోట్ల నిధులు సమకూరగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.37,645 కోట్లు లభించాయి. గత నెలలో 73.83 లక్షల మంది జీఎస్టీఆర్-3బీ రిటర్నులను దాఖలు చేశారు.
* 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.16.49 లక్షల కోట్ల పన్ను వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా..తొలి ఆరు నెలల్లో కేవలం రూ.6.07 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2018-19లో రూ.14.8 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, వీటిలో కేవలం రూ.5.8 లక్షల కోట్లు(39.4 శాతం), అంతక్రితం ఏడాది ఇది 44.2 శాతం, 2016-17లో 42.5 శాతం వసూలయ్యాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు గత ఐదేండ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన కాలానికిగాను వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి.

views: 632Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams