Current Affairs Telugu Daily

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ అంబాసిడర్‌గా మేరీకోమ్
* భారత బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం లభించింది.2020 లో టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 మంది అంబాసిడర్లలో మేరీకోమ్‌కు చోటు దక్కింది. మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్‌‌ను అంబాసిడర్‌గా నియమించారు.
* ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌‌గా, ఐదుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌ను గెలిచారు. 
* 51 కేజీల విభాగంలో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం కూడా సాధించారు. దీంతో మేరీకోమ్‌ను ఆసియా నుంచి మహిళల అథ్లెట్ల విభాగంలో అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది.
అంబాసిడర్స్- ప్రాతినిధ్యం వహించే ప్రాంతం
పురుషులు: లుక్మో లవల్(ఆఫ్రికా), జులియో సీజర్ లా క్రజ్(ఉత్తర-దక్షిణ అమెరికా), జియాంగ్వాన్ అషియాహు(ఆసియా), వాసిల్ లామచెంకో(యూరోప్), డేవిడ్ ఎన్‌యిక(ఓషియానియా).
మహిళలు: మేరీ కోమ్(ఆసియా), ఖాదిజ మార్డి(ఆఫ్రికా), మిఖైలా మేయర్(ఉత్తర-దక్షిణ అమెరికా), సారా ఔరహమౌనీ(యూరోప్), షెల్లీ వాట్స్(ఓషియానియా).

views: 637



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams