Current Affairs Telugu Daily

బాక్సింగ్‌లో శివ, పూజలకు స్వర్ణాలు
* టోక్యో ఒలింపిక్‌ బాక్సింగ్‌ టెస్టు ఈవెంట్లో భారత బాక్సర్లు శివ థాపా (63 కేజీలు), పూజ రాణి (75 కేజీలు) స్వర్ణాలు సాధించారు. 
* ఫైనల్లో శివ 5-0తో సానాటలి టోల్తయేవ్‌ (కజకిస్థాన్‌)ను ఓడించాడు. పూజ 4-1తో కైట్‌లిన్‌ పార్కర్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించి పసిడి గెలుచుకుంది.
* బాక్సర్ ఆశిష్ పురుషుల 69 కేజీల కేటగిరీ ఫైనల్లో 1-4తో సెవొన్ ఒకజవా (జపాన్) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు. 
* ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (91 కేజీలు), వహ్లిమ్‌పుయా (75 కేజీలు) కాంస్యాలు సాధించారు. 
* భారత్ మొత్తం 7(2 సర్ణ+ 1 రజత+ 4 కాంస్యం) పతకాలను సాధించింది. 

views: 604



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams