Current Affairs Telugu Daily

యునెస్కో సృజనాత్మక నగరాల్లో హైదరాబాద్
* ప్రపంచంలోని సృజనాత్మక నగరాల జాబితాలో మన హైదరాబాద్‌కు స్థానం దక్కింది. 
* ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో ‘సృజనాత్మక నగరా’ల జాబితాలో కొత్తగా చేర్చింది. ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ (అక్టోబరు 31) సందర్భంగా  జాబితాను విడుదల చేసింది. సంగీతం, లలిత కళలు, జానపద కళలు, సినిమా, సాహిత్యం, డిజిటల్‌ ఆర్ట్స్‌, పాక నైపుణ్యం (గాస్ట్రానమీ) కేంద్రంగా అభివృద్ధి చెందే నగరాలను ‘క్రియేటివ్‌ సిటీస్‌’ జాబితా లో యునెస్కో చేరుస్తుంటుంది. తాజాగా చేర్చిన 66 నగరాలతో కలిపి ఆ జాబితాలోని నగరాల సంఖ్య 246కు చేరింది.
* ప్రపంచవ్యాప్తంగా 66 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు లభించగా, అందులో మన దేశం నుంచి రెండు నగరాలను ఎంపికచేయడం విశేషం. 
* హైదరాబాద్ నగరాన్ని ఆహారం (గ్యాస్ట్రోనమీ) విభాగంలో ఎంపికచేయగా, ముంబై నగరం సినిమారంగం నుంచి స్థానం దక్కించుకున్నది.
*  మన దేశంనుంచి 12 నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానంకోసం దరఖాస్తులు పంపాయి.
* పరిశీలనలో హైదరాబాద్, ముంబై, లక్నో, శ్రీనగర్ మరో నాలుగు నగరాలు మాత్రమే నామినేట్ కాగా, అందులో హైదరాబాద్, ముంబై నగరాలకే క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించింది. ఈ సందర్భంగా మొత్తం ఏడు విభాగాల్లో క్రియేటివ్ నగరాలను ఎంపికచేశారు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, దేశ, విదేశాలకు చెందిన ఆహార పదార్థాలకు మన నగరం పెట్టింది పేరు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, రంజాన్ మాసంలో లభించే హలీంతోపాటు దేశంలో మరే ఇతర నగరంలో లభించని విధంగా అనేక తినుబండారాలు మన నగరంలో లభిస్తున్నాయి.

views: 650



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams