Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు
* తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించారు.
* ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి.. శ్రీరంగారావుతో ప్ర మాణం చేయించారు.
* సాంకేతిక, ఆర్థిక విభాగసభ్యులుగా ఎండీ మనోహర్‌రాజు, బండా రు కృష్ణయ్య కూడా ప్రమాణం స్వీకరించారు.
* శ్రీరంగారావుది కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌.
* హైదరాబాద్‌ జిల్లా కోర్టులో 31 ఏండ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 
* తెలంగాణ ఉద్యమం సమయంలో న్యాయవాదులు జేఏసీ తరఫున చురుకుగా పనిచేశారు. 
* ప్రస్తుతం ఆయన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.

views: 636Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams