Current Affairs Telugu Daily

ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్‌కుమార్
* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్ నియమితులయ్యారు. అక్టోబర్ 30న కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* 2019, నవంబర్ 13వ తేదీలోపు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్ రెండోస్థానంలో కొనసాగుతారు.
* జస్టిస్ రాకేష్‌కుమార్ 1959 జనవరి 1న బిహార్ పాట్నాలో జన్మించారు. 
* ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 
* 6 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సాగించిన ఆయన 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 
* కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 
* 2009 డిసెంబర్ 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై 2011, అక్టోబర్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

views: 622



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams