Current Affairs Telugu Daily

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో పాక్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహ్జాద్‌ 
* పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ అహ్మద్‌ షెహ్జాద్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. 
* దేశవాళీ క్రికెట్‌లో కైద్‌ ఇ అజామ్‌ ట్రోఫీ సందర్భంగా సింధ్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో అహ్మద్‌ బాల్‌ టాంపరింగ్‌ పాల్పడ్డాడని తేలింది. 
* ఫైసలాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అహ్మద్‌ ఇలా చేయడాన్ని మ్యాచ్‌ రిఫరీ నదీం అర్షద్‌ గుర్తించి అతడికి సమన్లు జారీ చేశాడు.
* అహ్మద్‌ గతంలోనూ ఓ వివాదంలో చిక్కుకొని శిక్షకు గురయ్యాడు. పీసీబీ యాంటీ డోపింగ్‌ నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో గత ఏడాది జులై 10న నాలుగు నెలలపాటు సస్పెండయ్యాడు.
* పాకిస్థాన్‌కప్‌ దేశావాళీ క్రికెట్‌ సందర్భంగా ఆటగాళ్లకి నిర్వహించిన డోపింగ్‌ పరీక్షల్లో అతడు పాజిటివ్‌గా తేలడంతో ఆ దేశ బోర్డు నాలుగు నెలలు అతన్ని నిషేధించింది. 

views: 608



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams