Current Affairs Telugu Daily

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు 
కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార`ప్రసార శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి ఎన్టీఏ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.  వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు 2017 జులై 17న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ఎన్టీఏ పక్షాలన్నీ ఆమోదం తెలిపాయి. దీంతో వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార`ప్రసార మంత్రి పదవికి జులై 17న రాజీనామా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచం మండలంలోని చవటపాళెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్యనాయుడు జన్మించారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పసి ప్రాయంలోనే తల్లి చనిపోవటంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. 1971 ఏప్రిల్‌ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు. వెంకయ్యనాయుడు విశాఖపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించేటప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో కీలక భూమిక నిర్వహించారు. తర్వాత జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్ధి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 17నెలలపాటు జైలులో ఉన్నారు. రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగానే కాకుండా వెంకయ్యనాయుడు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ వ్యవహారాలను వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్‌ పర్యవేక్షిస్తుంది
భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన వారిలో ఇప్పటి వరకూ ఇద్దరు తెలుగు వారు ఉన్నారు. 
- ఉప రాష్ట్రపతి పదవిని తొలిసారిగా తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధిష్టించారు. రెండు పర్యాయాలు కొనసాగిన అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 
- 1967లో వి.వి.గిరి ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రపతిగానూ ఆయన ఎన్నికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తమిళనాడులో, వి.వి.గిరి ఒరిస్సాలో జన్మించారు.
- యూపీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణగాంధీ (గాంధీ మనవడు)
వెంకయ్యనాయుడు ప్రొఫైల్‌
పేరు: ముప్పవరపు వెంకయ్యనాయుడు 
జన్మస్థలం: చవటపాళెం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా  
పుట్టిన తేదీ: 1949, జులై 1 
తల్లిదండ్రు: రంగయ్యనాయుడు, రమణమ్మ. 
విద్యార్హతలు: బీఏ, బీఎల్‌. 
విద్యాభ్యాసం: నెల్లూరు వీఆర్‌ కళాశాలలో డిగ్రీ, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా 
సతీమణి: ఉష 
 పిల్లలు: కుమార్తె దీపా వెంకట్‌, కుమారుడు హర్షవర్దన్‌
వెంకయ్యనాయుడు ప్రజా జీవిత ప్రస్థానం :
1973-74: ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షలు 
1974-75: లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ యువజన సంఘర్ష్‌ సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్‌ 
1977-80: జనతాపార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షలు 
1978-83: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నిక 
1980-83: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి  
1983-85: ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నిక (బీజేపీ శాసనసభపక్ష నేత) 
1988-93: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
1993-2000: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 
1998: కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక. భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నిక కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 
1998-99: హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ, వ్యవసాయ కమిటీల్లో సభ్యుడు. 
2000-02: వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 
2002-04: బీజేపీ జాతీయ అధ్యక్షుడు 
2004: కర్ణాటక నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపిక 
2014-: నరేంద్రమోడి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచారశాఖ మంత్రి. 
 కొన్నాళ్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. 
2016: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక 

views: 855



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams