Current Affairs Telugu Daily

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నమీబియా
* ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు  నమీబియా అర్హత సాధించింది.
* టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ఒమన్‌ను 54 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా నమీబియా ప్రపంచకప్‌కు బెర్త్ సాధించింది.
* మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును విలియమ్స్‌ (45, 41 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి ఆల్‌రౌండర్‌ జేజే స్మిత్‌ (59; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నాడు. స్మిత్‌ బౌలర్లపై విరుచుకుపడటంతో నమీబియా 161 పరుగులు చేయగలిగింది. 
* నమీబియాతో పాటు న్యూగినియా, స్కాట్లాండ్, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్ కూడా టీ20 ప్రపంచకప్‌కు ఇదివరకే అర్హత సాధించాయి ,

views: 664



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams